Saturday, April 27, 2024

రాహుల్ కేసు విచారణ ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పరువు నష్టం దావా తదనంతర అనర్హత వేటు కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం స్పందించింది. సంబంధిత వ్యాజ్యంలో ప్రతివాదులైన గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేషు మోడీకి, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు వెలువరించింది. సమాధానం ఇచ్చుకోవాలని ఆదేశించింది. మోడీ ఇంటిపేరుకు సంబంధించిన కేసులో తన దోషిత్వ ఖరారుపై స్టేకు గుజరాత్ హైకోర్టు నిరాకరణకు వ్యతిరేకంగా రాహుల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రధాని మోడీని కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పూర్ణేషు మోడీ రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఇది సూరత్ కోర్టు తీర్పు దరిమిలా చివరికి రాహుల్ ఎంపి పదవి పోవడానికి, ఆయనకు జైలుశిక్ష పడటానికి దారితీసింది.

రాహుల్ గాంధీ దోషిత్వ ఖరారు నిలిపివేయవచ్చా? దీనిపైఊ మీరెమంటారనేదే తమ పరిమిత ప్రశ్న అని నోటీసులో పూర్ణేషుకు, గుజరాత్ ప్రభుత్వానికి తెలిపారు. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ తమ క్లయింట్ కాంగ్రెస్ నేత అయిన రాహుల్ ఇప్పటికే విలువైన 111 రోజులు నష్టపోయినట్లు, ఓ పార్లమెంట్ సెషన్‌కు వెళ్లలేకపోయినట్లు, మరోటి కూడా నష్టపోతున్నట్లు తెలిపారు. సంబంధిత విషయంపై ఇప్పుడు నోటీసులు వెలువరించిన న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, పికె మిశ్రాతో కూడిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News