Sunday, May 5, 2024

ముందే నిర్ణయించుకున్నాం

- Advertisement -
- Advertisement -

Suresh Raina said on retirement along with Dhoni

ధోనీతో పాటుగా రిటైర్మెంట్‌పై సురేశ్ రైనా

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్‌నుంచి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి ఇవ్వాల్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆగస్టు 15వ తేదీ రిటైర్మెంట్ ప్రకటించి ధోనీ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో పడవేశాడు. ఇది జరిగిన కాస్సేపటికే మరో క్రికెటర్ సురేశ్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. చెన్నైలోని చెన్నై సూపర్ కింగ్స్‌క్యాంప్‌లో చేరిన కొద్దిసేపటికే వీరిద్దరి ప్రకటనలు వెలవడ్డాయి. ధోనీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టి20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా సురేశ్ రైనా తన 14 ఏళ్ల కెరీర్‌లో 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి 20లు, 300 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే తాను కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడం వెనుక ఎలాంటి సీక్రెట్స్ లేవని..అసలెందుకు అలా ప్రకటించాల్సి వచ్చిందో ఇన్నాళ్లకు రైనా తెలిపాడు.

‘ రిటైర్మెంట్ ప్రకటన చేయాలని ఇద్దరమూ కూడబలుక్కొని నిర్ణయించుకున్నాం. అందుకు తగినట్లుగానే మా మెదడులను మలుచుకున్నాం. ధోనీ జెర్సీ నంబరు 7..నా జెర్సీ నంబరు 3. ఇద్దరి నంబర్లు ఒక చోట చేరిస్తే 73. అప్పుడు 73వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చినందును 73 నంబరుకు విశ్రాంతి కల్పిస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాగే 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఇద్దరమూ రిటైర్మెంట్ ప్రకటించాం’ అనిసురేశ్ రైనాచెప్పాడు. ‘ధోనీ తన క్రికెట్ కెరీర్‌ను 2004 డిసెంబర్ 23న ప్రాంభించగా ఆరు నెలలు ఆలస్యంగా నేను జట్టులోకి వచ్చా. అంతర్జాతీయ క్రికెట్‌ను ఇద్దరమూ దాదాపు ఒకే సారి ప్రారంభించినందున మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా సిఎస్‌కెలో కూడా కలిసే ఉన్నాం. అంతర్జాతీయ కెరీర్ ముగిసినా ఐపిఎల్ మాత్రం ఇద్దరమూ కలిసే ఆడతాం’ అని రైనా చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News