Tuesday, April 30, 2024

సుశాంత్ కేసులో రియాను ఆరుగంటలు ప్రశ్నించిన ఎన్‌సిబి

- Advertisement -
- Advertisement -

Sushant Singh Rajput Death Case

ముంబై : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్, అతని గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి మాదకద్రవ్యాలను ఉపయోగించే వారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఆదివారం ఆరుగంటలపాటు రియా చక్రవర్తిని ప్రశ్నించింది. సాయంత్రం 6.15 గంటలకు ఆమెను విడిచిపెట్టారు. ఆమె ఆలస్యంగా వచ్చినందున దర్యాప్తు పూర్తిగా సాగలేదని, మళ్లీ ఆమెను సోమవారం పిలిపించి దర్యాప్తు సాగిస్తామని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే చెప్పారు. ఆదివారం ఉదయం రియా తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే ఈ కేసు విషయమై మాట్లాడుతూ ఇదో మంత్రకత్తె వేటలా ఉందని, రియా అరెస్టుకు కూడా సిద్ధమేనని చెప్పారు. ఒకరిని ప్రేమించడమే నేరమైతే ఆమె ఆ ప్రేమకు తగిన పరిణామాలను ఆమె ఎదుర్కొంటుందని, ఆమెది అమాయకత్వం అయినందున బీహార్ పోలీసులు , సిబిఐ, ఇడి, ఎన్‌సిబి పెట్టిన కేసుల నుంచి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏ కోర్టునూ ఆశ్రయించలేదని పైర్కొన్నారు.

డ్రగ్ సిండికేట్‌లో సుశాంత్ ఇంటి పనివాడి పాత్ర

ఆదివారం ఉదయం సుశాంత్ ఇంటి పనివాడు దీపేష్ సావంత్‌ను ఎన్‌సిబి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పర్చింది. సెప్టెంబర్ 9 వరకు సావంత్‌కు ఎన్‌సిబి కస్టడీలో రిమాండ్ విధించారు. సావంత్‌ను తమ కస్టడీలో ఉంచుకుని విచారించడం చాలా అవసరమని, రియా చక్రవర్తి సోదరుడు షౌకిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ సామ్యూల్ మిరండా జాయిద్ విలత్రా తదితరుల సమక్షంలో సావంత్‌ను విచారిస్తామని చెప్పారు. వీరంతా ప్రస్తుతం ఈ కేసులో కస్టడీలో ఉన్నారు. 2020 మార్చి 17న సావంత్, సామ్యూల్‌తో కలసి వెళ్లి జాయిద్ విలత్రా నుంచి ఐదు గ్రాముల గంజాయి తీసుకొచ్చాడని, ఎన్‌సిబి అధికారులు తెలిపారు. షౌకిక్ సూచనలపై సావంత్‌ను అరెస్టు చేసినట్టు చెప్పారు.

2020 ఏప్రిల్ 17న మోంట్ బ్లాక్ బిల్డింగ్ సమీపాన కైజాన్ ఇబ్రహిం నుంచి 10 గ్రాముల హషీష్ తీసుకోవాల్సిందిగా రియా,షౌకిక్ సావంత్‌కు చెప్పారు. కైజాన్ ఇబ్రహిం కూడా ఈ కేసులో అరెస్టు అయ్యాడు. 2020 మే 1న ద్వానే అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకోవాల్సిందిగా షౌకిక్ సామంత్‌కు చెప్పి, మే 2న 50 గ్రాముల గంజాయిని షౌకిక్ తీసుకున్నాడు. జూన్ మొదటి వారంలో రిషికేష్ పవార్ అనే డెలివరీ బాయ్ నుంచి 100 గ్రాముల గంజాయిని సావంత్ తీసుకున్నాడు. ఇదంతా డ్రగ్ సిండికేట్‌లో భాగంగా సావంత్‌ను ఎన్‌సిబి ఆరోపించింది. అయితే సావంత్ తరఫు న్యాయవాది రాజేంద్ర రథోడ్ ఎన్‌సిబి సావంత్ పాత్రను కచ్చితంగా స్పష్టీకరించలేదని కోర్టులో వాదించారు. రాజ్‌పుట్ వద్ద సావంత్ ఒక ఉద్యోగి మాత్రమే అని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News