Monday, May 6, 2024

ప్రజల కష్టాలు పట్టించుకోండి : రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వరదలతో ప్రజల కష్టాల్లో ఉంటే మహారాష్ట్రకు పోయి ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నడని బిజెపి ఎమ్మెల్యే రఘనందన్‌రావు విమర్శించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల దగ్గరకు వెళ్లేందుకు రూ.5 కోట్లు పెట్టి బస్సు కొన్నా అన్నాడు, కానీ కానీ ప్రజల దగ్గరకు పోతలేడు. భూపాల్ పల్లి జిల్లా మెరాంచపల్లి గ్రామానికి పోవడానికి ముఖ్యమంత్రికి సమయం లేదు. మంత్రులైనా ఆ గ్రామానికి వెళ్తరేమో అనుకున్నాం. మంత్రులు కూడా పోలేదు. అక్కడ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పాతబస్తీలో ఐదు కిలో మీటర్ల మెట్రోరైల్ నిర్మించలేని వారు… 250 కిలోమీటర్ల మెట్రో రైల్ వేస్తాడా ప్రజలు ఆలోచించాలి. ఎన్నికలు వస్తున్నాయనే కేబినెట్‌లో చర్చించి మెట్రో రైల్ వేస్తామని అబద్ధాలు చెప్తున్నారు’ అని పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోసం మెట్రో రైలు విస్తరణ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఒకే నెలలో అన్ని రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, పరీక్ష తేదీలను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు నిండి దొర్లుతుందని, రూ.600 కోట్ల రూపాయలతో కడెం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని పాండ్య కమిటీ సూచించిందని తెలిపారు. పాండ్య ఇచ్చిన కమిటీ నివేదికను కనీసం క్యాబినెట్ ఆమోదించలేదన్నారు. కడెం ప్రాజెక్టు రిపేర్లకు 70 శాతం నిధులు ఇస్తామని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అన్నమో రామచంద్రా అని వేడుకుంటున్న వరంగల్ జిల్లాలో పర్యటించడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరన్నారు. వరద సాయం కింద ఎమ్మెల్యేల ఒక నెల వేతనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News