Sunday, May 5, 2024

లీటర్‌కు నాలుగు రూపాయలు ఇన్సెంటీవ్ ఇస్తున్నాం: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాడి గేదెల ద్వారా ఉపాధి కోసం రూ.243 కోట్లు ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు సందర్భంగా తలసాని మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సిఎం కెసిఆర్ చర్యలు తీసుకోవాలన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి అడగకుండానే కెసిఆర్ నిధులు ఇస్తున్నారని, విజయ డెయిరీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందని, సిఎం కెసిఆర్ పాడిరైతులకు లీటర్‌కు నాలుగు రూపాయలు ఇన్సెంటీవ్ ఇస్తున్నారని, అంతర్జాతీయ స్థాయి మెగా డెయిరీ ఏర్పాటుకు రావిర్యాలలో పనులు జరుగుతున్నాయని, ఎస్‌సిలకు 75 శాతం సబ్సిడీతో పాడి గేదెలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. విజయ డెయిరీకి అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేస్తామని, గద్వాలలో విజయ డెయిరీ ఏర్పాటు చేస్తామని తలసాని స్పష్టం చేశారు. కరోనా వల్ల రైతులకు ఇచ్చే ఇన్సెంటివ్ కొంత బకాయి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News