Friday, April 26, 2024

దూసుకెళ్లిన టాటా మోటార్స్ షేర్!

- Advertisement -

- Advertisement -

ఒక్క సెషన్‌లోనే 22 శాతం వృద్ధి

ముంబయి: టాటా మోటార్స్ షేర్ ధర బుధవారం 22 శాతం పెరిగి జీవితకాల గరిష్ఠం రూ. 523ను తాకింది. టాటామోటార్స్ విద్యుత్ వాహన విభాగంలోకి టిపిజి రైజ్ క్లైమేట్ నుంచి బిలియన్ డాలర్లు (రూ. 7500 కోట్లు) సమీకరించడమే ఒక్క సెషన్‌లోనే ఇంత పెరుగుదలకు కారణం. బుధవారం ఓపెనింగ్‌లో రూ. 462 వద్ద ట్రేడయిన ఈ షేరు డే ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.509.70 వద్ద ముగిసింది. సంవత్సరం కిందట రూ. 126 వద్ద ట్రేడయిన ఈ షేరు ఏకంగా 415 శాతం పెరగడం విశేషమనే చెప్పాలి. మూడు రోజుల సెషన్‌లో ఈ షేరు విలువ 46 శాతం వృద్ధి చెందడం గమనార్హం. టాటా మోటార్స్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ మూలధనం రూ. 1.81 లక్షల కోట్లు.

టాటా మోటార్స్ తయారు చేస్తున్న విద్యుత్ వాహనాలు టెస్లా కార్లకు ఏమాత్రం తీసిపోనివి. 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం విద్యుత్ వాహనాలే ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ లక్షంగా ఉంది. టాటా మోటార్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిపిజికి చెందిన టిపిజి రైజింగ్ క్లైమేట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల బుధవారం ఒక్క సెషన్‌లోనే షేరు ధర 21 శాతంకు పైగా లాభపడింది. బుధవారం అత్యధికంగా లాభపడిన కంపెనీ టాటా మోటార్స్ అయితే అత్యధికంగా నష్టపోయిన కంపెనీ మారుతీ సుజుకీ. బెస్ట్ సెక్టార్‌గా ఆటో సెక్టార్ నిలవడం మరో విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News