Sunday, May 12, 2024

ఢిల్లీలో టీచర్ ప్రాణం తీసిన వాన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం భారీ వర్షం కరెంట్‌షాక్ రూపంలో ఓ 34 ఏండ్ల మహిళ ప్రాణాలు తీసింది. గత రాత్రి నుంచి ఇక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా ఉదయం ప్రీత్ విహార్ ప్రాంతానికి చెందిన సాక్షి ఆహుజా అనే మహిళ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని నెంబర్ వన్ నిష్క్రమణ ద్వారం వద్దకు మరో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలతో కలిసి తెల్లవారుజామున ఐదున్నర గంటలకు వచ్చారు. స్టేషన్ బయట నీటి గుంతలు ఉండటంతో పక్కనున్న కరెంటు స్తంభం పట్టుకున్న అహుజాకు

భారీగా అందులోని కరెంట్ షాక్ తగిలింది. దీనితో స్పృహతప్పిపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలు పొయ్యాయని పోలీసులు తెలిపారు. స్థానిక లక్ష్మినగర్‌లోని ప్రియదర్శిని విహార్‌లో ఉన్న లవ్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆమె టీచర్‌గా ఉన్నారు. ఈ ఘటనలో సాక్షి సోదరి మాధ్వీ చోప్రా గాయపడ్డారు. అధికారుల నిర్లక్షం ఫలితంగానే ఈ దుర్ఘటన జరిగిందని, దీనికి ఎవరు సమాధానం చెబుతారని సోదరి మాధ్వీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News