Saturday, May 4, 2024

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా బోధన ఉండాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి : విద్యార్థులలో దాగిన ప్రతిభను గుర్తించి వాటిని వెలికి తీసే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం ఉదయం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నతి, లక్షా కార్యక్రమాలపై హెడ్మాస్టర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. శిక్షణ శిబిరాన్ని పరిశీలించి శిక్షణ జరుగుచున్న తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఒక ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభను గుర్తించి వాటిని సానుపట్టే విధంగా ఉపాధ్యాయులు తమ బోధనా పద్దతులు మార్చుకోవాలని సూచించారు. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వారి విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉన్నతి అనే నూతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు లక్షా అనే కార్యక్రమం ద్వారా మరింత ఖచ్చితత్వంలో లక్షానికి చేరుకునే విధంగా ప్రభుత్వం ద్వారా చేపట్టడం జరిగిందన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులు మారాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుచున్న పరిణామాలు, మార్పులను ఉదాహరణ చూపిస్తూ విద్యాభ్యాసం జరగాలని అప్పుడే విద్యార్థులకు ఐ,క్యు పవర్ పెరుగుతుందన్నారు. ఇప్పుడు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంచేవిథంగా కృషి చేయాలని ప్రధారోపాధ్యాయులను సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News