Saturday, May 4, 2024

క్లీన్ స్వీప్‌పై టీమిండియా నజర్

- Advertisement -
- Advertisement -

పరువు కోసం ఐర్లాండ్
నేడు చివరి టి20

డబ్లిన్: ఐర్లాండ్‌తో బుధవారం జరిగే మూడో, చి వరి టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ దృష్టి సారించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు ఆతిథ్య ఐర్లాండ్ కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ ఆటతో తొలి రెండు టి20లను దక్కించుకుంది. మొదటి మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది.

Also Read: అందుమా…చంద్రమా

ఇక రెండో టి20లో మాత్రం భారీ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్‌వర్మ, శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబే తదితరులతో భారత్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్, బిష్ణోయ్‌లతో బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. తొలి రెండు మ్యాచుల్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా బౌలర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతనే జట్టుకు కీలకంగా మారాడు. మరోవైపు ఐర్లాండ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. అయితే కెప్టెన్ స్టిర్లింగ్, వికెట్ కీపర్ టక్కర్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే హ్యాట్రిక్ ఓటమి ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News