Saturday, April 27, 2024

‘ఆరేసిన’ అక్షర్

- Advertisement -
- Advertisement -

Team India scored 99 for 3 in first innings

 

అశ్విన్ మాయ, ఇంగ్లండ్ 112 ఆలౌట్, రాణించిన రోహిత్, భారత్ 99/3, గులాబి టెస్టు సమరం

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో మొతెరా మైదానంలో బుధవారం ఆరంభమైన మూడో డేనైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసారు. బుధవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ రోహిత్ శర్మ (57), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (1) క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 13 పరుగులు చేయాలి. అంతకుముందు టీమిండియా స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. భారత బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌటైంది. అక్షర్ పటేల్ ఆరు వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టి తనవంతు పాత్ర పోషించాడు. ఇషాంత్‌కు ఒక వికెట్ లభించింది.

ఆరంభంలోనే..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన రెండో ఓవర్‌లోనే వికెట్ తీసి భారత్‌కు పైచేయి సాధించాడు. ఇషాంత్ అద్భుత బంతితో ఇంగ్లండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లి (౦)ను ఔట్ చేశాడు. సిబ్లి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన్ జానీ బెయిర్‌స్టో కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ వెనక్కి పంపాడు.

క్రాలి ఒంటరి పోరాటం

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను మరో ఓపెనర్ జాక్ క్రాలి తనపై వేసుకున్నాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేసిన క్రాలి స్కోరును పరిగెత్తించాడు. అతనికి కెప్టెన్ జో రూట్ అండగా నిలిచాడు. ధాటిగా ఆడిన క్రాలి చూడచక్కని షాట్లతో అలరించాడు. అతను దూకుడును ప్రదర్శించడంతో ఇంగ్లండ్ కోలుకుంటున్నట్టే కనిపించింది. ఇదే క్రమంలో ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 47 పరుగులు కూడా జోడించారు.

అశ్విన్, అక్షర్ జోరు

కుదురుగా ఆడుతున్న ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడగొట్టాడు. 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన జో రూట్‌ను అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే క్రాలి కూడా పెవిలియన్ చేరాడు. 84 బంతుల్లో పది ఫోర్లతో 53 పరుగులు చేసిన క్రాలిను అక్షర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. బెన్ స్టోక్స్ (6), ఓలి పోప్ (1), బెన్ ఫోక్స్ (12), జోఫ్రా ఆర్చర్ (11), జాక్ లీచ్ (3), బ్రాడ్ (3)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఇటు అశ్విన్, అటు అక్షర్ పోటీ పడి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 112 పరుగుల వద్దే ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News