Saturday, April 27, 2024

ఒకే స్కూల్లో 229 మంది విద్యార్థులకు కరోనా

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అమరావతి, యాత్మల్ జిల్లాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. వాషిమ్ జిల్లాలోని ఓ స్కూల్ 229 మంది విద్యార్థులు కరోనా వైరస్ సోకడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌లుగా ప్రకటించి లాక్‌డౌన్ విధించారు. కరోనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ముంబయి మహానగర పాలక సంస్థ తెలిపింది. మహారాష్ట్రలో కొత్తగా 8807 కరోనా కేసులు నమోదుకాగా 80 మంది చనిపోయారని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 21.21 లక్షలకు చేరుకోగా 52 వేల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 20.08 లక్షల మంది కోలుకోగా 61 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News