Saturday, May 11, 2024

చరిత్ర సృష్టిస్తారా?

- Advertisement -
- Advertisement -

Women's T20 World Cup

 

అందరికళ్లు భారత్‌పైనే!

మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన విశ్వ విజేతగా నిలువడం అనుకున్నంత తేలిక కాదు. అయితే లీగ్ దశలో ఆస్ట్రేలియాను ఓడించడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫైనల్ సమరంలోనూ ఆస్ట్రేలియాను మట్టికరిపించి విశ్వవిజేతగా అవతరించాలని తహతహలాడుతోంది. దీని కోసం భారత్ ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఇదిలావుండగా ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిన భారత్ ఈసారి మాత్రం అలాంటి ఫలితం రాకుండా చూడాలని భావిస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. యువ క్రికెటర్ల చేరికతో భారత్ చాలా బలంగా మారింది. షెఫాలీ వర్మ రూపంలో భారత్‌కు పదునైన అస్త్రం ఉంది.

ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా ప్రస్తుత భారత జట్టుకు ఉందని చెప్పాలి. పరిస్థితులు కలిసి వస్తే ఈసారి ప్రపంచకప్‌ను గెలిచే మెరుగైన అవకాశాలు భారత్‌కు కనిపిస్తున్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు టీమిండియాలో కొదవలేదు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తానియా భాటియా, శిఖా పాండే తదితరులతో భారత్ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో శిఖా పాండే, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి, దీప్తి తదితరులు అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా శిఖా, రాధా, పూనమ్‌లు భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇక, ఆస్ట్రేలియా కూడా చాలా బలంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ఎన్నో ప్రపంచకప్ ట్రోఫీలు సాధించిన ఆస్ట్రేలియా మరో కప్పుపై కన్నేసింది. ఈసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్ జట్టును ముందుండి నడిపిస్తోంది. ఈసారి కూడా లానింగ్‌తో భారత్‌కు పెను ప్రమాదం పొంచి ఉంది. బౌలింగ్‌లోనూ ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ చాలా కష్ట పడక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాలి. సీనియర్లు మంధాన, హర్మన్, వేద తదితరులు జట్టుకు అండగా నిలువాలి. మరోవైపు షెఫాలీ, జెమీమా, దీప్తి తమ జోరును కొనసాగించాలి. అప్పుడే భారత్‌కు గెలిచే అవకాశాలు ఉంటాయి.

Team India to final of Women’s T20 World Cup
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News