Saturday, May 11, 2024

నాలుగు సవరణ బిల్లులకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం
బిల్లులను సభలో ప్రవేశపెట్టిన మంత్రులు
ప్రశ్నోత్తరాలు రద్దు, చర్చ అనంతరం బిల్లులకు ఆమోదం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు మంగళవారం ఆమోదం తెలిపింది. జిహెచ్‌ఎంసి సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లును ఆమోదిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్ధేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు
మున్సిపల్ సవరణ బిల్లును మంత్రి కెటిఆర్ ప్రవేశపెట్టగా, సీఆర్పీ సవరణ బిల్లును ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్ స్టాంప్ చట్ట సవరణ బిల్లు, ధరణి ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టసవరణ, వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే బిల్లులను ప్రవేశ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పెట్టారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులతో పాటు టిఆర్‌ఎస్ సభ్యులు చర్చలో పాల్గొన్నారు.
బిల్ నెంబర్(1): భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ.
బిల్ నెంబర్(2): వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేశారు. ధరణి ద్వారానే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టానికి సవరణ. వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టాలను సవరించారు.
బిల్ నెంబర్(3): జిహెచ్‌ఎంసి చట్ట సవరణలో 5 కీలక అంశాలకు సవరణలు: ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి జవాబుదారీతనం, బాధ్యతలు చట్టంలో నిబంధనలు చేర్చనున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించేలా కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతతో పాటు పదిశాతం హరితహారానికి బడ్జెట్ కేటాయింపు. వార్డు కమిటీల ఏర్పాటు, వాటి పనివిధానంలో మార్పులు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి, రెండుసార్లు ఒకే రిజర్వేషన్ అమలు సహా జిహెచ్‌ఎంసీ చట్టాలను సవరించారు.
బిల్ నెంబర్(4): హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించాలని ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ చట్టసవరణ బిల్లులపై శాసనసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు.

Telangana Assembly to Passes four Bills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News