Friday, April 26, 2024

రేపు అమిత్ షాతో తెలంగాణ బిజెపి నేతల కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః బిజెపి రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఢిల్లీకి రావల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో సమావేశం ఉంటుందని ఆయన కార్యాలయం సూచించింది. ఫోన్ కాల్ అందడంతో సోమవారం ఢిల్లీకి కొందరు నేతలు వెళ్ళారు. మరికొందరు మంగళవారం ఉదయం వెళ్ళనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.

తెలంగాణకు చెందిన బిజెపి ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు కేంద్రమంత్రి అమిత్ షా సంప్రదింపులు జరుపుతూ దిశనిర్దేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం నాడు తెలంగాణ బిజెపి నేతలంతా ఢిల్లీలో అమిత్ షా కార్యాలయంలో భేటీ కానున్నారు. మరోవైపు బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ సీక్రెట్ ఆపరేషన్ మెదలుపెట్టారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నేతలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే నివేదికను పార్టీ అధిష్టానానికి ఆయన సమర్పించినట్లు సమాచారం. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ముమ్మరంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లను నిర్వహిస్తోంది. నిర్దేశిత లక్షం మేరకు ఈనెల 28 నాటికి మొత్తం 11 వేల మీటింగ్‌లను పూర్తి చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News