Friday, May 3, 2024

నగరంలో బోనాల ఉత్సవాలకు ప్రత్యేకత

- Advertisement -
- Advertisement -

telangana bonalu celebrations in telugu

బోనాల జాతరకు నగరం ముస్తాబు

=ఏటా కోట్లు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం
=ఉజ్జయినిమహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్లతోపాటు పలు ఆలయాల్లో వైభవంగా వేడుకలు
=సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాల ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు.. ప్రతి ఏటా ఆషాఢ మాసం మొదలు శ్రావణమాసం చివరి వరకు బోనాల పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే గత ఏడాది కా రణంగా బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వ ప రం గా అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఈసారి నగరంలోని బో నాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి నగరం ముస్తాబు అవుతోంది. జులై 8 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుండడంతో 11వ తేదీన గొల్కోండ బోనాలతో నగరంలో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నగరంలో ముందుగా గోల్కొండ బోనాల పండుగ జరుపుకోవడం అనవాయితీ. ఆ తర్వాత జులై 25న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగ నున్నా యి. ఈ ఉత్సవాలు ముగిసిన వెంటనే మొదటి ఆదివారం ఆగస్టు 1వ తేదీన ఓల్ట్ సిటీతో పాటు నగర వ్యాప్తంగా బోనాల పండుగను జరుపుకొనున్నారు.

ఈ ఏడాది పెద్ద ఎత్తున ఏర్పాట్లు

బోనాల పండుగను ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తిం చడంతో ఏర్పాట్లన్నింటిని ప్రభుత్వమే చేస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి ఏటా కన్నుల పండువగా బోనాల ఉత్స వా లు జరుగుతున్నాయి. ఈ ఏటా మరింత పెద్ద ఎత్తున జరు పేందుకు ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు రూ.60 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లాల్ దర్వాజ అమ్మవారితో పాటు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరుపున పట్టు వ స్త్రాలను సమర్పించనున్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ దేవా లయాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గాను ఆర్ధిక సహాయం కింద ప్రభుత్వపరంగా రూ.1.50కోట్ల అందిం చ నుంది.

అంతేకాకుండా ప్రభుత్వ పరంగా నగరం వ్యాప్తంగా ఉన్న 189 ప్రదాన దేవాలయాల వద్ద కళాకారులతో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లకు సిద్దం అవుతున్నారు. ఉత్సవాల ముందే నగరం వ్యాప్తంగా సాధ్యమైన ఎ క్కువ మందికి వ్యాక్సినేషన్ వేసేందుకు యుద్ధ్ద ప్రాతిపదికన చర్య లు చేపట్టిన అధికారులు అంతేపెద్ద ఎత్తున మాస్కులు, శా నిటైజర్లను ఏ ర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా గొల్కోండ, సికింద్రాబాద్ , ఓల్ సిటీలో జరిగే బోనాల ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొన నుండడంతో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏరాట్లు చేయనున్నారు. ఇందుకు ఇప్పటీకే నుంచి సంబంధిత శాఖలు నిమగ్నమైయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News