Wednesday, May 1, 2024

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన సర్కార్

- Advertisement -
- Advertisement -

complete abolition of lockdown in telangana

హైదరాబాద్: తెలంగాణలో రేపట్నుంచి లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేసింది సర్కార్. లాక్‌డౌన్‌ సంపూర్ణంగా ఎత్తివేస్తూ సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 ఉద్ధృతి తగ్గడంతో లాక్‌డౌన్‌ ను ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. లాక్‌డౌన్‌ ఆంక్షలన్నీ ఎత్తివేయాలని అధికారులకు మంత్రివర్గం ఆదేశించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గిందని వైద్యారోగ్య శాఖ నివేదిక సమర్పించింది. నివేదికను పరిశీలించిన మంత్రి వర్గం  లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగించాలని ఆదేశించింది. దీంతో అన్ని కార్యకలాపాలు యథావిధిగా జరగనున్నాయి. దీనిపై కాసేపట్లో ప్రభుత్వం మర్గదర్శకాలు విదుదల చేసే అవకాశముంది.

 

Telangana Cabinet decides to lift lockdown completely

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News