Friday, April 26, 2024

దేశం తలసరి ఆదాయం కంటే తెలంగాణదే ఎక్కువ: హరీష్

- Advertisement -
- Advertisement -

 water Release

హైదరాబాద్: దేశంలో తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని సృష్టించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. కెసిఆర్ నాయకత్వంలో ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ ముందుకు వెళ్తోందన్నారు. బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద రాసే అంకెలు కాదన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశం తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉందని, వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కొనియాడారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిందన్నారు. ఈ బడ్జెట్‌లో రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు, రైతు ఏ కారణం వల్ల మరణించినా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నామని వెల్లడించారు. ఆర్థిక మాంద్యం లెక్క చేయకుండా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామని, రూ.25 వేల లోపు రుణాలు ఉన్న రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేశామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా తగ్గిందన్నారు. కేంద్రం నిధులను అరకోరగా విడుదల చేస్తోందని, 2019-20 ఫిబ్రవరి నాటికి రావాల్సిన నిధుల వాటా 6.3 శాతానికి తగ్గిందని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు సమన్వమ సమితి పేరును రైతు బంధుగా మార్చామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని హరీష్ వివరించాడు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షితమైన మంచి నీరు అందిస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల ఎకరాలకు ఆయకట్ట స్థిరీకరించామన్నారు. సంక్షేమ పథకాల కోసం నలబై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, సంక్షేమ పథకాల కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News