Saturday, May 4, 2024

సిఎం పిఆర్‌ఒ విజయ్‌కుమార్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

సిఎం పిఆర్‌ఒ విజయ్‌కుమార్ రాజీనామా
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న గటిక విజయ్‌కుమార్ రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పిఆర్‌ఒ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. “వ్యక్తిగత కారణాల వల్ల నేను సీఎం పీఆర్‌ఓ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇంత గొప్ప స్థాయిలో పని చేసే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఉన్న వారందరికి ధన్యవాదాలు” అంటూ విజయకుమార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. సిఎంఒలో పిఆర్‌ఒ పదవితో పాటు ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్(కార్పోరేట్ ఎఫైర్స్) పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమైన పిఆర్‌ఒగా ఉన్న విజయ్‌కుమార్ రాజీనామాపై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వైరల్ అవుతున్నాయి. విజయ్‌కుమార్ వ్యవహారశైలి, ఆయనపై కొన్ని నిర్ధిష్ట ఆరోపణలపై టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులు సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీనిపై సీనియర్ జర్నలిస్టు ఒకరు మాట్లాడుతూ, విజయ్‌కుమార్ పిఆర్‌ఒగా కాకుండా అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిణామం చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. ఒక దిన పత్రికలో మండల స్థాయి రిపోర్టర్‌గా తన పాత్రికేయ జీవితం ప్రారంభించిన విజయ్‌కుమార్, అనతికాలంలోనే ఉన్నత స్థాయి ఎదిగారని, కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండకుండా అందుకు భిన్నంగా వ్యవహరించారని మరో సీనియర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య తత్సంబంధాలు నడపడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.

Telangana CM PRO Vijay Kumar resigns

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News