Monday, April 29, 2024

రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ 0.54 శాతం

- Advertisement -
- Advertisement -

Telangana Coronavirus Death Rate is 0.54 Percent

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ కేవలం 0.54 శాతం మాత్రమే తేలింది. ఇది దేశ సగటు 1.4 కంటే తక్కువగా రికార్డు కావడం గమనార్హం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ విధానాలను సమర్ధవంతంగా అమలు చేయడంతోనే మరణాల శాతం తగ్గుతుందని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1604 కరోనా డెత్స్ సంభవించాయి. దీంతో కరోనా మరణాలను అదుపు చేయడంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉందని ఎకనామిక్ సర్వే కూడా పేర్కొంది.

ఇదిలా ఉండగా మంగళవారం 40,203 టెస్టులు చేయగా 185 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 27, ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 7, జగిత్యాల 5, జనగాం 4, భూపాలపల్లి 5, గద్వాల 0, కామారెడ్డి 4, కరీంనగర్ 10,ఖమ్మం 8 , ఆసిఫాబాద్ 1, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 2, మంచిర్యాల 5, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 12, ములుగు 4, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 5, నారాయణపేట్ 0, నిర్మల్ 4, నిజామాబాద్ 5, పెద్దపల్లి 7, సిరిసిల్లా 4, రంగారెడ్డి 13, సంగారెడ్డి 8, సిద్ధిపేట 4, సూర్యాపేట్ 3,వికారాబాద్ 6, వనపర్తి 1, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 8, యాదాద్రిలో మరో ముగ్గురికి వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,94,924కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,91,312కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

97 శాతం గవర్నమెంట్ సెక్టార్‌లోనే…..

ప్రతి రోజు 97 శాతం టెస్టులు గవర్నమెంట్ సెక్టార్‌లోనే చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల 55 వేల 308 టెస్టులు చేయగా ప్రతి పది మందిలో ఇద్దరికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Telangana Coronavirus Death Rate is 0.54 Percent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News