Saturday, May 4, 2024

వాటితో తెలంగాణ దశ మారిపోతుంది: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Telangana develop with food processing

మనతెలంగాణ/హైదరాబాద్:  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణ దశ మారిపోతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో వ్యవసాయరంగ స్వరూపాన్ని సమూలంగా మార్చివేయా లన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ప్రతి సీజన్‌లో వరి సాగు నుంచి తెలంగాణ రైతాంగం బయటకు రావాలన్నారు. వరి కన్నా తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఇచ్చే వాణిజ్యపంటలను సాగు చేయాలని ఆయన సూచించారు.

రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంట్‌తో తెలంగాణ రైతాంగం ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా మోర్బీ జిల్లా అలువద్ తాలూకా సుఖ్ పూర్ గ్రామ రైతులు అజీద్‌భాయ్, జుగ్మాల్ భాయ్ ల వేరుశనగ క్షేత్రాన్ని, మోర్బీ సమీపంలో బోన్ విల్లే ఫుడ్స్ లిమిటెడ్ ను మంత్రి నిరంజన్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వేరుశెనగ ఆధారిత ఉత్పత్తులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వెంట రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండి కేశవులు, గుజరాత్ జెడిహెచ్ (జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్) చావ్డా తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News