Friday, May 3, 2024

నేడు ఇంజినీరింగ్ ఎంసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -
Telangana EAMCET result 2021
ఉ.11గం॥కు విడుదల చేయనున్న విద్యామంత్రి సబిత
తర్వాత వెల్లడికానున్న వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలు
ఈ నెల 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్
సెప్టెంబర్ 4నుంచి 13వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజీ ఎత్తివేస్తూ నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 4,5,6, తేదీలను నిర్వహించిన ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రి సబి తా ఇంద్రారెడ్డి వెల్లడించనున్నారు. ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఈ నెల10న విడుదల చేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను తర్వాత వెల్లడించనున్నారు.ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొద టి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుందని, ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు వివరిస్తున్నారు. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందని, సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారని సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇంటర్ వెయిటేజ్ ఎత్తివేస్తూ నిర్ణయం

ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్‌లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్‌కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను నిర్వహించని ప్రభుత్వం ఎంసెట్ పరీక్షలను మాత్రం సజావుగా నిర్వహించింది. కరోనా ప్రభావం పొంచి ఉన్న నేపథ్యంలో పలుమార్లు ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియను పొడగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పరీక్షలను పూర్తి చేసింది. దీంతో తాజాగా పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News