Sunday, April 28, 2024

దేశ జిడిపిలో తెలంగాణ వాటా 5 శాతం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana five percentage in India GDP

హైదరాబాద్: దేశ జిడిపిలో తెలంగాణ వాటా ఐదు శాతమని కేంద్రమే ప్రకటించిందని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టిపిసిసి ప్రధాన కార్యదర్శి చెల్మెడ లక్ష్మి నర్సింహారావు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. చెల్మెడకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, రాజ్యసభ ఎంపి కెకె ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణ వస్తే పరిపాలన చేసుకుంటారా? అని హేళన చేశారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మన తలసరి ఆదాయం 1.12 లక్షల అని, ఇప్పుడు మన తలసరి ఆదాయం రూ.2.37 లక్షలకు పెరిగిందన్నారు. సమర్థుడైన నాయకుడు సిఎం కెసిఆర్ రూపంలో ఉన్నాడని పొగిడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News