Friday, May 10, 2024

తెలంగాణాస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2021 ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

విద్యా రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉంది
ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి
ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు తొలిరోజు అనూహ్య స్పందన
-సందేహాలు నివృత్తి చేసుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
-వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహనకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహణ

Telangana Golden Education Fair 2021 begins
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా టీ-న్యూస్, అపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంయుక్తంగా గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌తో ముందుకు వచ్చింది. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణాస్ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2021 ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. శనివారం వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఫెయిర్‌లో విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలన్నింటిని నివృత్తి చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ ఫెయిర్‌లో వేలాది మంది విద్యార్థులు పాల్గొని తమ తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండానే ఆయా కళాశాలల్లోని కోర్సులు, ఫీజులు, ఇతర సౌకర్యాలపై సమగ్ర సమాచారం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏర్పాటు చేసిన టీ న్యూస్‌కు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విద్యా రంగంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబడిందని తెలిపారు. దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్(గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రీషియో- జిఇఆర్) దేశం జిఇఆర్ 26 శాతం ఉంటే, తెలంగాణ జిఇఆర్ 36 శాతంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు కృషి వల్ల అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని, దాంతో ఇక్కడ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా సమయంలో.. చాలా అద్భుతంగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. దాదాపు 100కు పైగా కాలేజీలు ఒకే ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నాయని అన్నారు.

ప్రతి ఒక్కరి జీవితంలో విద్య చాలా ముఖ్యమని, తల్లిదండ్రులు ఇతర అవసరాలు తగ్గించుకోనైనా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కోరారు. టీన్యూస్ ఆధ్వర్యంలో 8వ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీన్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్ బాబు, సిజిఎం ఉపేందర్. శ్రీదత్తా గ్రూప్ ఆఫ్ చైర్మన్ పాండురంగారెడ్డి, శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ హృదయ్ రెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ కె.వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి శ్రీనివాస రావు, అపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎండి దినేష్, టీన్యూస్ డిజిఎం కిరణ్, మార్కెటింగ్ టీం సత్యపాల్ శ్రీనివాస్, భాస్కర్, వెంకట్ రెడ్డి, సతీష్ పాల్గొన్నారు. ఈ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్లాంటినం స్పాన్సర్‌గా మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, డైమండ్ స్పాన్సర్‌గా సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్. గోల్డ్ స్పాన్సర్‌గా మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహరించాయి.

ఎంత ర్యాంకుకు ఏ బ్రాంచీలు సీటు వస్తుందో అడుగుతున్నారు : సోని, అసిస్టెంట్ ప్రొఫెసర్, జిఎన్‌ఐ

ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకులకు ఇంజనీరింగ్‌లో ఏ కళాశాలలో, ఏ కోర్సులో చేరితే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగి తెలుసుకుంటున్నారని గురునానర్ ఇన్‌స్టిట్యూషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సోని తెలిపారు. మంచి కళాశాలలో సీటు రావాలంటే వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ఎలా ఎంపిక చేసుకోవాలి..? ఈ కోర్సు చదివిన వారికి అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి…? తదితర సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని అన్నారు.
కొత్త కోర్సుల గురించి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు : పుష్ప కుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిఎంఆర్
ఇంజనీరింగ్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడిగి తెలుసుకుంటున్నారని సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్ప కుమారి పేర్కొన్నారు. కొత్త కోర్సుల్లో చేరితే భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయో అడుగుతున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News