Wednesday, May 1, 2024

క్రీస్తు బోధనలు ఆచరణీయం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని పండుగలను అధికారికంగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రం లౌకిక స్పూర్తికి ప్రతీకగా నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపండుగను ప్రభుత్వాలు పట్టించుకోని విషయం తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తోంది. అన్ని మతాలను గౌరవిస్తోంది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వం దుస్తులను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని చర్చీలలో క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి ఇంటికి పెద్దన్నలా ముఖ్యమంత్రి కెసిఆర్ పండుగలకు బట్టలను కానుకగా ఇస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 35 వేల మంది క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలను ప్రభుత్వం కానుకగా ఇస్తోంది. 2.80 లక్షల మంది పురుషులకు ప్యాంటు షర్ట్, 2 లక్షల 77వేల 500మంది మహిళలకు చీరెలు, 2 లక్షల 77వేల 500మంది బాలికలకు డ్రెస్ మెటీరియల్ ప్రభుత్వం అందజేసింది. క్రైస్తవుల కోసం ఉప్పల్ భగాయత్‌లో క్రిస్టియన్ భవన్‌ను ప్రభు త్వం నిర్మిస్తోంది. చర్చీలు, గ్రేవ్ యార్డ్‌ల అభివృద్ధికి అ త్యధిక నిధులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే ద క్కుతుంది. ఉప్పల్‌లో క్రిస్టియన్ భవన్ కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రూ.10 కోట్ల వ్యయం తో క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తున్నారు. చర్చీల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. స్థానిక సంస్థల అనుమతితో చర్చీలను నిర్మిచుకోవచ్చు. గత 8 సంవత్సరాల్లో 411 చర్చిలకు రూ. 2.63 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
క్రిస్టియన్లకు డ్రైవర్ ఎంపవర్‌మెంట్ స్కీం
క్రిస్టియన్ మైనారిటీ యువతకు అండగా నిలిచేలా ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోంది. నిరద్యోగ క్రిస్టియన్లకు ఈ పథకం కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందజేస్తున్నారు. కార్లను ట్రావెల్స్‌గా, క్యాబ్ మాదిరిగా నడుపుకుంటారు. 154 మందికి రూ.6.90 కోట్లను సబ్సిడీగా అందజేశారు. రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. ఇప్పటి వరకు 1748 మందికి రూ.19 కోట్ల సబ్సిడీ అందించింది. క్రిస్టియన్ మైనారిటీలకు ఉపాధి శిక్షణ కల్పిస్తున్నారు. న్యాయ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇవ్వడం జరుగుతోంది. మైనారిటీ పారిశ్రామికవేత్తల కోసం టిఎస్ ప్రైమ్ నెలకొల్పడం జరిగింది. ఐటి పారిశ్రామికవేత్తల కోసం ఐటి పార్కులో అవకాశాలు కల్పించడం జరుగుతోంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు నిధులు ఇవ్వడం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News