Monday, April 29, 2024

తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మాత శిశు సంరక్షణకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థ్ధానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిని స్త్రీలకు రూ. 2 వేలతో రూపొందించిన న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న కేసిఆర్ కిట్ ఇప్పటికే సూపర్ హిట్ అయిందని అదే స్ఫూర్తితో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసి తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రోటిన్స్, మినరల్స్, విటమిన్స్‌లను గర్భిణి స్త్రీలకు పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం ,హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిషన్ కిట్ల ప్రదాన లక్షమన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న మాత శిశు ఆ సు పత్రి భవన నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఎంపీపీ లకావత్ మానస, ఏఎంసి చైర్మన్ ఎడబోయిన రజని, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ ఎఎంసీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, కాసర్ల ఆశోక్ బాబు, మండల టిఆర్‌ఎస్ అద్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అద్యక్షుడు ఎండి. అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట చిట్టి గోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ శృతి, వైద్య అధికారులు సిబ్బంది, గర్బిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News