Saturday, April 27, 2024

కరోనాతో రూ.52 వేల కోట్ల నష్టం వాటిల్లింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana govt loss of Rs 52 000 crore with corona

హైదరాబాద్: మనం కలలో కూడా ఊహించని ఉత్పాతం కరోనా రూపంలో వచ్చిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రికగ్నైస్డ్ స్కూల్స్ మెనేజ్‌మెంట్ ఆసోషియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కరెస్పాండెన్స్, టీచర్ల సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. తెలంగాణలో రూ.1.81 లక్షల రెవెన్యూ వస్తుందనుకుంటే.. కరోనాతో రూ.52 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, హెలికాప్టర్ మనీ ద్వారా రాష్ట్రాలకు సాయం చేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ అడిగిన కూడా స్పందించలేదన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం తాము పని చేయడం లేదని కెటిఆర్ పేర్కొన్నారు.

ఆరు సంవత్సరాలలో ఫీజు రియింబర్స్‌మెంట్ రూపంలో 12,800 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఆరేళ్లలో సామాన్యుడికి లాభం జరిగిందో… లేక నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోవాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం విదేశాలలో చదువుతామంటే నాలుగు వేల మంది విద్యార్థులకు 20 లక్షల రూపాయలు చొప్పున కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత 53 డిగ్రీ కాలేజీలు, 11 పాలిటెక్సిక్ కాలేజీలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి సురభి వాణీ దేవి, ప్రైవేట్ టీచర్లు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News