Friday, April 26, 2024

హఫీజ్‌పేట్ భూములు ప్రైవేట్‌వే: హైకోర్టు‌

- Advertisement -
- Advertisement -

హఫీజ్‌పేట్‌లోని 140 ఎకరాలు ప్రభుత్వ భూములు కాదు: హైకోర్టు
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం

TS high court stay on non agricultural Land registrations

మనతెలంగాణ/హైదరాబాద్: హఫీజ్‌పేట్ సర్వే నంబరు 80లోని భూములపై మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. సర్వే నెంబరు 80లోని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేట్‌దేనని తెలిపింది. ఈక్రమంలో పిటిషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా అందులో 50 ఎకరాలు ప్రవీణ్ రావు సహా యజమానుల పేరిట నమోదు చేయాలని సూచించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హఫీజ్‌పేట్ భూవివాదంలోనే ప్రవీణ్ రావు కిడ్నాప్ అభియోగంపై ఇటీవల అఖిలప్రియ సహా పలువురిని అరెస్టు చేశారు. ఇదిలావుండగా హఫీజ్ పేట భూవివాదమే బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు దారితీసింది. ఎపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఈ కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై బెయిల్‌పై ఆమె విడుదలైన సంగతి తెలిసిందే. ఇక, హైకోర్టు తీర్పు ఇప్పుడు కీలకంగా కావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సమాయత్తమౌతోంది.

Telangana High Court judgement on Hafeezpet land

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News