Monday, April 29, 2024

పేద విద్యార్థికి తెలంగాణ హైకోర్టు అండ

- Advertisement -
- Advertisement -
సీట్ కేటాయించండి. దార్వాడ్ ఐఐటికి ఆదేశం

హైదరాబాద్: ఓ పేద విద్యార్థికి తెలంగాణ హైకోర్టు అండగా నిలిచింది. రూ.20 వేలు కట్టలేదని ఐఐటీ సీట్ రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. వెంటేనే ఆ విద్యార్థికి సీటును కేటాయించాలని ఐఐటీ దార్వాడ్ ను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వంశీ కళ్యాణ్ కు ఐఐటీ  జేఈఈ లో వంశీ కి 1033 ర్యాంక్ వచ్చింది. మెకానికల్ సీట్ రావడంతో చివరి నిమిషంలో ఫీజు కట్టే ప్రయత్నం చేయగా టెక్నికల్ కారణాల వల్ల యూనివర్సిటీకి విద్యార్థి ఫీజు చేరలేదు. దీంతో ఐఐటీ దార్వాడ్ విద్యార్థి సీట్ ను రద్దు చేసింది. విద్యార్థి వంశీ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించాడు. విద్యార్థి భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని సీట్ ను తిరిగి కేటాయించాలని ఐఐటీ దార్వాడ్ కు హై కోర్ట్ ఆదేశించింది. వెంటనే కాలేజ్ లో చేర్చుకోవాలపని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News