Monday, April 29, 2024

‘ధాన్యం ధర్నాలకు’ రాష్ట్రం సన్నద్ధం

- Advertisement -
- Advertisement -

Telangana is gearing up for 'grain dharnas'

రేపటి కార్యక్రమం విజయవంతానికి టిఆర్‌ఎస్ సన్నాహాలు

కోడ్‌కు లోబడే ధర్నాలు, కలెక్టర్‌ల నుంచి అనుమతి తీసుకోండి : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ / కరీంనగర్/వరంగల్ : కేంద్రం నుంచి ధాన్యాన్ని కొనిపించడం కోసం 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరుప తలపెట్టిన ధర్నా కార్యక్రమాలకు టిఆర్‌ఎస్ పార్టీ నేతలు సమరోత్సాహంతో కదులుతున్నారు. కాగా స్థానిక సంస్థలు, శాసనసభ సభ్యుల కోటా నుంచి శాసనమండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారుల నుంచి ముందస్తూ అనుమతులు తీసుకుని ధర్నా కార్యక్రమాన్ని విజవంతం చేసే పనుల్లో గులాబీ శ్రేణులు ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ 12వ తేదీన తలపెట్టిన ధర్నాకు కలెక్టర్ల నుంచి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని టిఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ అమల్లో వున్న దృష్ట్యా ధర్నాల కోసం కలెక్టర్ల నుంచి విధిగా అనుమతి తీసుకోవాలన్నారు.

వారి అనుమతితోనే ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల నిబంధనలకు ఎక్కడా భంగం వాటిల్లకూడదని స్పష్టం చేశారు. రైతులకు సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టిఆర్‌ఎస్ తలపెట్టిన ధర్నా ఏర్పాట్లను మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరికి నిరసనగా ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకు, రాష్ట్రంలోని బిజెపి నేతల మాటలకు పొంతనలేదని పరస్పరం విరుద్దంగా ఉన్నాయన్నారు. రాష్ట్రబిజెపి నేతలు వరి పండించాలని చెబుతుండగా… అసలుధాన్యం కొనుగోలు చేసేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతోందని మండిపడ్డారు. దేశంలో పంజాబ్ తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేస్తుందని వారు స్పష్టం చేశారు. సాగుచట్టాలతో రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. కేంద్రం నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల మద్దతు తీసుకుంటామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లోనూకేంద్ర వైఖరిని టిఆర్‌ఎస్ ఎంపిలు తీవ్రస్థాయిలో ఎండగట్టనున్నామన్నారు.

కేంద్రం దిగొచ్చేదాకా నిరసనలు

‘తెలంగాణ రైతు పండించిన పంటను కేంద్రం కొనం అని చెప్పడం దారుణం. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ధర్నాలు చేసే పరిస్థితి కల్పించింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా నిరసనలు కొనసాగుతాయి’ అని పౌర శాఖ మం త్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆయన కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ రైతన్నను కేంద్రం అణిచి వేస్తుందని మండిపడ్డారు. ఆర్థిక బాధల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దశలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తూ ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. ఇందుకు నిరసనగా టిఆర్‌ఎస్ పార్టీ ఆదేశం మేరకు ఈ నెల 12 శుక్రవారం జిల్లాలో రైతు ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

కరీంనగర్ నియోజకవర్గంలో కలెక్టరేట్, చొప్పదండి నియోజవర్గంలోని గంగాధర, మానకొండూరు పట్టణంతో పాటు హుజూరాబాద్ ఆర్‌డిఒ కార్యాలయం ముందు పెద్దఎత్తున రైతులతో కలిసి కేంద్రం వైఖరికి నిరసనగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్నాహ్నం ఒంటి గంట వరకూ ధర్నాలు చేయాలని టిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోవిధంగా ప్రకటనలు చేస్తూ తప్పుదొవ పట్టిస్తున్నారని విమర్శించారు. బిజెపి నేతలు సైతం తెలంగాణ రైతాంగానికి మేలు చేసేవిధంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఎల్‌ఎలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌రావు, టిఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనేవరకూ ఆందోళన : మంత్రి ఎర్రబెల్లి

కేంద్రం వరి కొనుగోలు చేసేంతవరకూ టిఆర్‌ఎస్ ఆందోళనలను చేస్తూనే ఉంటుందని, ఈ 12న జరిగే ఆందోళనల్లో రై తులు అధికంగా పాల్గొనాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడు తూ క్రవా రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News