Monday, May 6, 2024

శాంతి భద్రతలో తెలంగాణ పోలీస్ భేష్

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: శాంతి భద్రత విషయంలో తెలంగాణ పోలీస్ భేష్ అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కితాబిచ్చారు. సురక్ష దినోత్సవంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు సబ్ డివిజన్ నేతృత్వంలో ఇస్నాపూర్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని స్థానిక డిఎస్పి భీంరెడ్డితో కలసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలోని రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో తీసుకొచ్చిన సంస్కరణలు గొప్పవన్నారు. పోలీస్ శాఖకు ఇచ్చిన స్వేచ్ఛతోనే రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు.పోలీసులు ఎప్పుడు శాంతి భద్రత విషయంలో ముందుంటు రక్తదా శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయ మన్నారు.

ప్రెండ్లీ పోలీస్ వ్యవస్థతో పోలీసులు ప్రజలకు మరింత దగ్గరైయ్యారన్నారు.తెలంగాణ పోలీస్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.సామాన్యుడు సైతం నేరుగా పోలీస్ కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేసే వెసులు భాటు కలిగించిన సౌకర్యం సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. పోలీస్ కంట్రోల్ రూంకు వచ్చిన ఫిర్యాదులను వెంటేనె సందందిత పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కెసిఆర్ పదవి బాధ్యతలు చెపట్టిన వెంటనే పోలీసు శాఖకు అధునాతన వాహనాలు అందించారన్నారు. రక్తదానం చేసిన యువతకు , పోలీసులకు ప్రశంస పత్రాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్‌ల అధికారులు వేణుగోపాల్ రెడ్డి,శ్రీనివాసులు రెడ్డి,సురేందర్ రెడ్డి, వేణు కుమా,వినాయక రెడ్డి,లాలు నాయక్,ప్రవీణ్ రెడ్డి ఇస్నాపూర్ సర్పంచ్ బాలమణి, ఎంపిటిసి అంజిరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News