Wednesday, May 1, 2024

నిజామాబాద్ లో భారీ వర్షం…. పాఠశాలలకు సెలవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఉదయం 5 గంటల నుంచి జల్లులు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోపాల్ మండలంలో 15.7 సెంటిమీటర్లు, ఇందల్వాయ్‌లో 14.8 సెంటి మీటర్లు, డిచ్‌పల్లిలో 14.2 సెంటిమీటర్లు, జక్రాన్‌పల్లిలో 13.8 సెంటిమీటర్లు, సిరికొండలో 13.5 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల దృష్ట్యా జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్-బస్వపూర్ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు ఆగిపోయాయి. సిరికొండ మండలంలో ఉద్ధృతంగా కప్పలవాగు ప్రవహిస్తోంది. గడ్కోల్ వద్ద లోలెవల్ బ్రిడ్జ్‌పై వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ వర్షానికి పలు కాలనీలు జలమయంగా మారాయి. కోరుట్లలో రహదారిపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News