Tuesday, May 14, 2024

కృష్ణబోర్డు భేటీకి తెలంగాణ

- Advertisement -
- Advertisement -

Telangana representative attends KRMB meeting on sep 1st

1న జరిగే కెఆర్‌ఎంబి సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర ప్రతినిధులు

అధికారులతో ప్రగతిభవన్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో
నిర్ణయం కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్స్ సహా అన్ని
వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలి వాస్తవాలన్నీ బోర్డు
ముందుంచాలి ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం
ఇప్పటికే బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ కెఆర్‌ఎంబి సమావేశం అజెండాలో
కూడా చేరిక ఎపి అభ్యంతరాలపై కూడా ప్రగతిభవన్‌లో సమావేశంలో చర్చ?

మన తెలంగాణ/హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) సమావేశానికి రాష్ట్రం హాజరు కావాలని నిర్ణయించారు. బుధవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సమావేశాల్లో కృష్ణాజలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో న్యాయమైన నీటి వాటా కోసం కెఆర్‌ఎంబి, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు.

సాధికారిక సమాచారంతో కెఆర్‌ఎంబి సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్, సి ఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఇఎన్‌సి మురళీధర్, సిఎం ఒఎస్‌డి శ్రీధర్ దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నదీజలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా కోసం నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో రాష్ట్రం పక్షాన బలమైన వాణి వినిపించాలని సంబంధిత అధికారులకు సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కృష్ణా జలా ల్లో 50 శాతం జలాలు రాష్ట్రం వాటాగా కావాలన్న విషయమై అన్ని ఆధారాలతో సమావేశం ముందు ఉంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం నుంచే ఇది అమలు అయ్యే విధంగా బోర్డు సమావేశంలో గట్టిగా పట్టుబట్టాలని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ అంశాన్ని కెఆర్‌ఎంబి సమావేశ ఎజెండాగా కూడా చేర్చారన్నారు.

అలాగే జలవిద్యుత్ ఉత్పత్తిపై ఎపి అభ్యంతరాలపై చర్చించే అంశాన్ని బోర్డు ఎజెండాలో చేర్చారు. ఈ రెండింటితో పాటు ఇతర అంశాలకు సంబంధించి రాష్ట్రం పక్షాన వినిపించాల్సిన వాదనలపై వారికి సిఎం కెసిఆర్ సమగ్రంగా వివరించారు. కృష్ణా జలాల వాటాలో ఎపి ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలపై కూడా ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. నీటి వాటాలపై దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు న్యాయమైన, చట్టపరమైన అంశాల ఆధారంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని సిఎం దిశానిర్దేశం చేశారు. వాస్తవాలన్నీ బోర్డు ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News