Sunday, May 5, 2024

మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 18న మంచినీళ్ల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ వేడుకలో ప్రజలకు మిషన్ భగీరథ తాగునీటి స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా మిషన్ భగీరథ అధికారులు, పంచాయతి సెక్రటరీలు, ఎంపిడిఓలు, తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒకప్పుడు తాగునీటికి అనేక సమస్యలు ఉండేవని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. తాగునీటి సమస్యలను అధిగమించి జిల్లాలో శుద్ధమైన తాగునీరు ఏ విధంగా అందిస్తున్నాము, నీటిని ఎలా శుద్ధి చేస్తున్నామనే అంశాలపై ప్రజలకు మంచినీళ్ల శుద్ధి కేంద్రాలను చూపించి అవగాహన కల్పించాలని తెలిపారు. మిషన్ భగీరథ నీటి స్వచ్ఛతపై ఎవరికైనా అపోహలు ఉంటే నేటి అవగాహనతో ప్రజలకు స్పష్టత వచ్చే విధంగా చూడాలన్నారు.

ప్రతి గ్రామ పంచాయతీలో మంచినీటి పండుగ చేసుకోవాలని వారికి నీరు ఏ విధంగా వస్తుంది, నీటి ప్రాధాన్యత, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై అవగాహన కల్పించేందుకు మంచినీటి శుద్ధి కేంద్రాల వద్దకు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, మిషన్ భగీరథ అధికారులు, తహసిల్దార్లు, ఎంపిడిఓలు, పంచాయతి సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News