Saturday, May 4, 2024

పాక్ జైళ్లలో 17 మంది భారతీయ మానసిక రోగులు

- Advertisement -
- Advertisement -

There are 17 Indian Mental patients in Pakistan jail

ఆరేళ్లయినా వారెవరో తెలియని దుస్థితి : భారత్ ఆవేదన

న్యూఢిల్లీ :పాక్ జైళ్లలో భారతీయ మానసిక రోగులు 17 మంది ఉన్నారని ఆ దేశం తెలియచేసి ఆరేళ్లవుతున్నా వారెవరో తెలియని దుస్థితి కొన సాగుతోంది. వారిని గుర్తించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో వారి ఫోటోలను ప్రదర్శించడమే కాక, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను కూడా వారి వివరాలు తెలియచేయాలని పదే పదే అభ్యర్థించింది. వాళ్ల నేరాలపై తీర్పులు వెలువడ్డాయి. కానీ వారి జాతీయత నిర్ధారణ కాక, వారిని శరణార్ధులుగా భారత్‌కు పంపడం కుదరడం లేదు. పాక్ జైళ్లలో భారతీయులుగా భావిస్తున్న 17 మందిలో గుల్లు జన్, అజ్మీరా,నకయా, హసీనా అనే నలుగురు మహిళలు ఉన్నారు.

మిగతా వారు సోను సింగ్, సురీందర్ మెహతో, ప్రహ్లాద్ సింగ్, సిల్రోఫ్ సలీం బిర్జు, రాజు, బిప్లా, రూపీపాల్, పన్వసిలాల్, రాజు మహోలీ, శ్యామ్ సుందర్, రమేష్; రాజు రాయ్ ఉన్నారు. వీరెవరినైనా గుర్తిస్తే హోం వ్యవహారాల కార్యదర్శి (విదేశీయుల విభాగం)కి తెలియచేయాలని హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. లేదా కేంద్ర పాలిత ప్రాంత డిజిపి లేదా ఐజిపి, పోలీస్ కమిషనర్‌కు తెలియచేయాలని కోరింది. 2015 లో ఈ 17 మంది శిక్షాకాలం పూర్తయింది. అయితే వీరు మానసిక రోగులు కావడంతో తమ కుటుంబీకులు ఎవరో చెప్పలేక పోయారు. దాంతో వీరిని భారత్‌కు పంపడం సమస్యగా మారింది. ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ కార్యాలయం వీరి ఫోటోలను భారత ప్రభుత్వానికి పంపించింది. వారి కుటుంబ సభ్యుల ఆరా తీయాలని కోరింది. కానీ ఈ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News