Monday, April 29, 2024

టీకా తీసుకున్నా కొవిడ్ బాధితులైన వారు స్వల్పమే

- Advertisement -
- Advertisement -

There are very few Covid victims who have been vaccinated

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటివరకు 53.14 కోట్ల మందికి పైగా టీకా తీసుకోగా, వీరిలో కేవలం 0.048 శాతం మంది అంటే దాదాపు 2.6 లక్షల మంది మాత్రమే టీకా పొందిన తరువాత కరోనా బారిన పడినట్టు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. వీరిలో 1,71,511 మందికి తొలి డోసు తీసుకున్న తరువాత కొవిడ్ సోకగా, 87 వేల మంది రెండు డోసులు తీసుకున్న తరువాత వైరస్ బారిన పడినట్టు పేర్కొన్నాయి. వ్యాక్సినేషన్ తరువాత వైరస్ సోకడాన్ని బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌గా పిలుస్తారు. అయితే టీకా తీసుకున్న వారిలో ప్రాణాపాయ ముప్పు తక్కువేనని ఇప్పటికే అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు ఈ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ ఇవ్వగలవని నిపుణులు చెబుతున్నా ప్రస్తుతం ఎదురవుతున్న కరోనా వేరియంట్ల దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

There are very few Covid victims who have been vaccinated

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News