Wednesday, May 1, 2024

చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన దొంగ

- Advertisement -
- Advertisement -
Thief arrested for attempting chain snatching
యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద ఘటన

హైదరాబాద్: మహిళ మెడలోని బంగారు చైన్‌ను స్నాచింగ్ చేసి పారిపోతున్న దొంగను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన నగరంలోని యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని మధురానగర్‌కు చెందిన సమీరా యూసుఫ్‌గూడ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి సమీరా మెడలోని చైన్‌ను స్నాచింగ్ చేసేందుకు యత్నించాడు. బాధితురాలు వెంటనే కేకలు వేయడంతో స్థానికులు పుట్టుకునేందుకు యత్నించారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిసిటివిలను పరిశీలించిన పోలీసులకు నిందితుడికి సంబంధించిన క్లూ లభించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Thief arrested for attempting chain snatching

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News