Home జాతీయ వార్తలు కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

కరెంట్ షాక్‌తో ముగ్గురు రైతుల మృతి

Three farmers killed by current shock

చోతౌదేపూర్ (గుజరాత్): గుజరాత్ లోని చోతౌదేపూర్ జిల్లా గిరిజన గ్రామం పిపాల్‌సత్‌లో మంగళవారం రాత్రి కరెంట్‌షాక్‌తో ముగ్గురు రైతులు మృతి చెందారు. మృతుల్లో రాజు బారియా (47),ఆయన కుమారుడు సంజయ్‌బారియా (22),మరో రైతు జసు తడ్వి (30) ఉన్నారని పోలీసులు బుధవారం తెలిపారు. జంతువుల నుంచి పంటపొలాలను రక్షించుకోడానికి వేసిన విద్యుత్ సరఫరా కలిగిన కంచె తీగను తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు పంపారు.