Tuesday, April 30, 2024

ఒకేరోజు ఎసిబి వలలో ముగ్గురు అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. వేర్వేరు చోట్ల ముగ్గురు అధికారులను ఎసిబి అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుజూరాబాద్ ఆర్‌టిసి డిపో మేనేజర్ లంచం తీసుకుంటూ ఎసి బి కి చిక్కారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన ఆర్‌టిసి డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించలేదని ఛార్జిమెమో అందించారు. అయి తే, శాఖాపరమైన కేసు కొట్టేసేందుకు డిపో మేనేజర్ లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు గతంలోనే రూ.10 వేలు అందించగా ఎల్కతుర్తి హోటల్ లో మరో రూ.20 వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అటు, నల్గొండ డ్రగ్ ఇన్ స్పెక్టర్ సోమశేఖర్ కూడా ఎసిబికి పట్టుబడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఎసిబిని ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్రణాళికతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఆసిఫాబాద్ లో ఎస్‌ఐ రాజ్యలక్ష్మి రూ.25 వేలు లంచం తీసుకుం టూ ఎసిబికి చిక్కారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News