Friday, May 3, 2024

డిసెంబరు 28న శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్ల కోటా విడుదల..

- Advertisement -
- Advertisement -

Tirumala Srivari break Darshan tickets release on Dec 28

తిరుమల: 2022 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజున 1000 బ్రేక్ దర్శన(రూ.500 లఘు దర్శనం) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు 1000 మహాలఘు దర్శన(రూ.300) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన(రూ.500) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన(రూ.500) టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Tirumala Srivari break Darshan tickets release on Dec 28

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News