Saturday, April 27, 2024

శుక్రవారం రాశి ఫలాలు(29-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. సోదరుల నుండి వచ్చిన సమాచారం వల్ల ఆనందం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.

వ్యషభం –  ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని వ్యక్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది.

మిథునం – నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు.

కర్కాటకం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

కన్య –  కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు.

తుల – ఎంత కష్టించినా ఫలితం కష్టమే. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వ్యశ్చికం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి.

ధనుస్సు – కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూతగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మకరం – సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు.

కుంభం – ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. యత్న కార్యసిద్ది పొందుతారు.స్వల్ప ధన లాభం .

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News