Thursday, May 9, 2024

గురువారం రాశి ఫలాలు(08-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు.

వృషభం – నూతన విద్యా ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం – నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు.

కర్కాటకం – ముఖ్యమైన పనులలో జాప్యం  జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు.

సింహం – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.

కన్య – దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగుచూస్తుంది.

తుల – శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృశ్చికం – బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తు లాభం.

ధనుస్సు – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.

మకరం – కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.

కుంభం – కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. సోదరుల కలయిక. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సంతానం నుండి ధనలాభం.

మీనం – ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News