Saturday, May 11, 2024

సోమవారం రాశి ఫలాలు(09-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం :- పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. స్వల్ప ధన లాభం.

మిథునం :- ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:- పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రత్యేక హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

సింహం:- పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థాన మార్పులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకొంటారు. సోదరుల నుండి ఆర్ధిక లావాదేవీలు సఫలీకృతం అవుతాయి.

కన్య:- దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులు  శుభవార్తలు వింటారు. మీడియా వారికి చేతినిండా పని ఉంటుంది.

తుల :- అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఎదురైన ఒడిదుడుకులు, ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం :- ఉద్యోగస్తులకి ఉన్నత పదవులు పొందుతారు. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. వాహన యోగం గోచరిస్తున్నది.

ధనుస్సు:- బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. సంతానంనకు నూతన ఉద్యోగ ప్రాప్తి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. షేర్లు, భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

మకరం :- వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు సద్దుమణుగుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం గోచరిస్తున్నది. జీవిత భాగస్వామితో మాటలు స్వల్ప వివాదాలకు దారి తీస్తాయి.

కుంభం :- ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారస్తులకి అనుకున్నంత లాభసాటి ఉండదు

మీనం :- వృత్తి-వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తు,వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్శాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూల పడతాయి.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News