Sunday, May 12, 2024

మంగళ వారం రాశి ఫలాలు (17-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం :- ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తుకొనుగోలు.

వృషభం:- ప్రయాణాలు లాభసాటి ప్రోత్సాహకరంగా ఉంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం :- స్వశక్తే మీకు బాసటగా ఉంటుంది. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు.

కర్కాటక :- కుటుంబ సమస్యల నుండి బయట పడతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ద వద్దు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

సింహం:- నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంతానానికి సంబందించి తలపెట్టిన  నూతన ప్రయత్నాలు కలిసివస్తాయి. వాహన యోగం యోగిస్తుంది.

కన్య:- వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లు తొలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. పోరాడి మరీ కాంట్రాక్టులను దక్కించుకొంటారు. నిజాయితీకి తెగువ ఎక్కువ అని నిరూపిస్తారు. సోదరుల నుండి శుభ వార్తలు  అందుతాయి.

తుల:- సన్నిహితుల సహకారంతో అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ముఖ్యమైన ప్రయాణాలు రద్దు చేసుకొంటారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

వృశ్చికం :- కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక వనరులు సమతుల్యంగా ఉంటాయి. శ్రమ ఫలిస్తుంది.  ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు  కొనుగోలు చేస్తారు.

ధనుస్సు:- నూతన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తారు.

మకరం :- ఋణ బాధల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. పెట్టుబడులకి తగిన లాభాలు పొందుతారు. అధికశ్రమ మూలంగా శారీరక అలసట, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.

కుంభం :- షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయటా అందరి   మన్ననలు పొందుతారు. బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.  గృహోపకరణాలు, ఆభరణాల కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు.

మీనం:- కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దైవ చింతన ఎక్కువ అవుతుంది. విద్యార్ధులకి సంకేతిక విద్యావకాశాలు మెండుగా ఉంటాయి. వారి భవిష్యత్తు కోసం ఇప్పటినుండే  ప్రణాళికలు రూపుదిద్దుతారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News