Monday, April 29, 2024

రెండుసార్లు రుణమాఫీ ఘనత మాదే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: బిఆర్‌ఎస్‌కు మేనిఫె స్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో సమానమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అ న్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం సమీపంలో నిర్మించిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాల యం తెలంగాణ భవన్‌ను సోమవారం పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావులతో కలిసి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే అని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ పర్యాయం రుణమాఫీలో రైతులకు అందించాల్సిన రూ. 20 వేల కోట్ల రూపాయలలో రూ. 13 వేల కోట్ల రూపాయలు రైతులకు అందాయని మిగిలినవి కూడా త్వరలో అందుతాయన్నారు. రుణమాఫీపై ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు వల్ల రైతులకు పంట సాయం అందుతుండగా, రైతు బీమా వల్ల రైతుల కు చనిపోయిన వారం రోజుల్లోనే రూ.లు 5 లక్షలు అందుతున్నాయన్నారు.

రైతు బీమా మాదిరిగానే ప్రజలందరికీ వర్తించేలా కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకం తెచ్చామని కెటిఆర్ అన్నారు. తెలంగాణలో ఉన్న తెల్లకార్డులున్న 93 లక్షల కుటుంబాలకు ఉపయోగపడే లా కెసిఆర్ బీమా ఆలోచన చేశామన్నారు. ప్రభుత్వమే వీ రికి ప్రీమియం చెల్లిస్తుందని ఎవరైనా తెల్లరేషన్ కార్డు ఉన్నవారు మరణిస్తే వారికుటుంబానికి 5 లక్షల రూపాయలు అందేలా ఎల్‌ఐసితో ఒప్పందం చేసుకోనున్నామన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణ గా మారింది. కెసిఆర్ ముందుచూపు వల్ల నిర్మితమైన కా ళేశ్వరం ప్రాజెక్టు వల్ల కరువు ప్రాంతాలు నేడు పంటలతో కలకల లాడుతున్నాయన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం అందిస్తున్నట్లుగా రేషన్ షాపుల ద్వారా ప్రజలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రెండు వేల కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతున్నా త్వరలో అమలు చేస్తామన్నారు.

మహిళలకు అత్యంత ఉపయోగపడే వంటగ్యాస్ ధరలు మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బాగా పెరిగిందని, వంటగ్యాస్ సిలిండర్‌కు దండంపెట్టి, సిలిండర్ ధర బాగా పెరిగిందని నరేంద్ర మోడీ విమర్శించి ప్ర ధాని అయ్యాడని, ప్రస్తుతం మోడీ సిలిండర్ల ధరలు విపరీతంగా పెంచారని అందువల్ల , మహిళల కష్టాలు చూడలేక సిఎం కెసిఆర్ సిలిండర్లను నాలుగు వందలకే అందిస్తామన్నారని అందువల్ల మహిళలు ప్రచారం బాగా చేసి తెలంగాణలో బిజెపి డిపాజిట్లు గల్లంతు చేసి బిజేపిని బండకేసి కొట్టేలా చూడాలన్నారు. ఆరోగ్య శ్రీ పథకం స్థానంలో కెసిఆర్ ఆరోగ్య రక్ష పథకంలో 15 లక్షల రూపాయలకు పెంచి అన్ని రకాల పరీక్షలు చేసేలా పథకం తెచ్చామన్నారు, సౌభాగ్య లక్ష్మి పథకం వల్ల అర్హులైన మహిళలకు నెలకు 3వేల రూపాయలు భృతి అందిస్తామన్నారు. 45 రోజులు మా కోసం పని చేయం డి, ఐదేళ్లు మీకు సేవ చేస్తామని మంత్రి కెటిఆర్ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. పార్టీలోకి వచ్చే వారందరిని స్వాగతిస్తామన్నారు. సిఎం కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎం చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్ కోరారు.
కెసిఆర్ మన ఆస్తి, కాపాడుకుందాం : మంత్రి గంగుల కమలాకర్
కెసిఆర్ మన ఆస్తి జాగ్రత్తగా కాపాడుకుందాం, ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల పట్ల తస్మాత్ జాగ్రత్త అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్టుండే ఇప్పుడు ఎట్లున్నయో గుర్తు చే సుకోవాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరెక్కడ అమలు కావడం లేదన్నారు. రైతుల వద్ద గ్రా మాలకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదన్నారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజల కళ్ల ల్లో ఆనంద భాష్పాలు చూస్తున్నామన్నారు. తాము కోరుకునేది కూడా ప్రజల కళ్లల్లో ఆనందం ఉండాలన్నారు. గతంలో వలసలుపోయే తెలంగాణ ప్రజలు ఇప్పుడు స్థా నికంగా ఉపాధి పొందుతున్నారని, ఇతర ప్రాంతాల నుం చి తెలంగాణకు వలసలు వస్తున్నారన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు నెలలైనా అమలు కావ డం లేదన్నారు. అక్కడి ప్రజలు బియ్యం కోసం మనను అడుగుతున్నారని అన్నారు. ఛత్తీస్‌ఘఢ్‌లో కూడా ఇచ్చిన హామీలు నిలుపుకోలేదన్నారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బో యినిపెల్లి వినోద్‌కుమార్, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎంఎల్‌సి ఎల్ రమణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పవర్‌లూమ్ టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సి రిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బిఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వేములవాడ ఎంఎల్‌ఏ అభ్యర్థి చల్మెడ లక్ష్మినర్సింహరావు, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, మాజి ఎంఎల్‌ఏ ఉచ్చిడి మోహన్ రెడ్డితో పాటుగా పలువురుబిఆర్‌ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ను, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలకు వా రివారి చాంబర్లలో బాధ్యతలు అప్పగించారు. అనంతరం నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో సిరిసిల్లలో మంగళవారం నాటి (నేటి) సిఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వా ద సభను విజయవంతం చేయడం కోసం అనుసరించాల్సిన ప్రణాళికపై, వచ్చే ఎన్నికల్లో ప్రచారం సాగించే విధానంపై చర్చించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News