Sunday, April 28, 2024

సోమవారం రాశి ఫలాలు(27-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

వృషభం – ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుండి ధనలాభం.

మిథునం – వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు.

కర్కాటకం – శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. ధనలాభం.

సింహం – పరిచయాలు పెరుగుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా

కన్య – రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థ వంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పనులు నిదానంగా సాగుతాయి.

తుల – శుభవార్తలు అందుకొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు. నూతన వస్తు కొనుగోలు.

వృశ్చికం – బంధువులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాలలో స్థానచలనాలు.

ధనుస్సు – వ్యవహారాలలో పురోగతి పొందుతారు. భూవివాదలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ధనలాభం.

మకరం – ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘ సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం.

కుంభం – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. స్వల్ప ధనలాభం.

మీనం – చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News