Sunday, May 12, 2024

సోమవారం రాశి ఫలాలు (30-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. కొన్ని విషయాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. షేర్లు, భూముల క్రయవిక్రయాలు మధ్యస్థమైన లాభాలు ఉంటాయి. కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది.

వృషభం:- వత్తి-వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైన అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్లమెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు అతి కష్టం మీద పొందుతారు. విద్యార్ధులకు ఏకాగ్రత లోపిస్తుంది.

మిథునం :- ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. భాగస్వామ్మ వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు.దూరప్రాంతాల నుండి వచ్చే శుభవార్తలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి.నూతన గృహ యోగం ఉన్నది.

కర్కాటకం :- ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. కుటుంబ సౌఖ్యం కోసం పాటుపడతారు.

సింహం :- షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.క్షణికావేశాలకు దూరంగా ఉండండి. చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలోని పెద్దలకు అనారోగ్య సూచన. జాగ్రత్త వహించండి.

కన్య:- మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలు,ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథుల నుండి విలువైన నమాచారం అందుకొంటారు.స్వల్ప ధనలాభం.

తుల:- ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తులాభం.

వృశ్చికం :- బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయవ్యత్తి, వ్యా! లో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ధనలాభం.

ధనుస్సు:- ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్తు,వస్త్ర లాభాలు పొందుతారు. సంతానంపరంగా నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. గృహయోగం గోచరిస్తున్నది.

మకరం:- ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. వృత్తి-వ్యాపారాలలోఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. స్వల్ప ధనలాభం.

కుంభం :- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తు, ఆబరణాలు కొనుగోలు చేస్తారు.ఆర్థిక పరంగా ప్రగతి సాధిస్తారు. ఋణ ఒత్తిడులు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం:- ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.పనులు నిదానంగా సాగినా సకాలంలో పూర్తి అవుతాయి. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనసౌఖ్యం కలుగుతుంది.

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News