Monday, May 6, 2024

నేడు జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్ద అన్నదాతలు ఆందోళనలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్‌ః వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల ఇస్తే చాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించడం సిగ్గుచేటని రంగారెడ్డి జిల్లా రైతు బందు సమితి ఛైర్మన్ వంగేటి లకా్ష్మరెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమెరికాలోని జరుగుతున్న తానా మహాసభలో రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతులకు అసలు ఉచిత విద్యుత్ కొరుకొవడంలేదని, మూడు గంటలు ఇస్తే చాలని, రైతులు కొరుతున్నట్లు చేప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి వాఖ్యలు తెలంగాణ రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో రైతులకు ఏ విధంగా విద్యుత్ అందించారో అదే పద్దతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకరావడానికి ప్రయత్నిస్తోందని రేవంత్ వాఖ్యలే వాటికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే కరేంట్ లేకుండ పోతుందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న రైతు బందు, రైతు భీమా, దాన్యం కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉసులేకుండ పోతాయని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వాఖ్యలకు నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నేడు జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్ద అన్నదాతలు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News