Monday, May 6, 2024

తెరుచుకున్న క్రీడా గ్రామం

- Advertisement -
- Advertisement -

Tokyo 2020 Olympic Village Opens

 

టోక్యో: త్వరలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ కోసం క్రీడా గ్రామాన్ని మంగళవారం తెరిచారు. ఈ నెల 23 నుంచి విశ్వక్రీడలు జరుగనున్న విషయం తెలిసిందే. కాగా కరోనా కారణంగా జపాన్‌లో ప్రస్తుతం అత్యయిక పరిస్థితిని విధించారు. దీంతో ఎంతో ఘనంగా జరగాల్సిన ఒలింపిక్స్‌ను సాదాసీదాగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రీడలు సమీపించడంతో ఒలింపిక్స్ గ్రామాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే క్రీడా గ్రామంలో ఆంక్షలను కఠినతరం చేశారు. ఇక్కడ ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రెండుసార్లు పరీక్షలు ఉంటాయి. టీకా వేయించుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. బౌతిక దూరం పాటించడంతో పాటు కరోనా నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 11 వేలమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News