Monday, April 29, 2024

కుండపోత వర్షం

- Advertisement -
- Advertisement -

Torrential rain in Telangana State

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. యదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.4 సెం.మీల వర్షం కురిసింది. పరిసర మండలాల్లోనూ 8 సెం.మీల వానాలు కురిసాయి. అలాగే ఆదిలాబాద్‌లోని బోథ్ మండలం పోచార 11.8 సెం.మీల వర్షం కురిసింది. ఖమ్మంలో మధిరలో 9.1 సెం.మీలు, సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్ మండలం చట్లాపల్లిలో 7.2 సెంటిమీటర్ల వర్షం కురిసినట్లు తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక సంఘం వెల్లడించింది.

వరంగల్ అర్బన్ హాసన్‌పర్తి మండలం నాగారంలో 6.6 సెం. మీలు, రంగారెడ్డిలో 6.3 సెం.మీలు, కామారెడ్డిలోని గాంధారి మండల కేంద్రంలో 5 సెంటి మీటర్లు, జిహెచ్‌ఎంసి ప్రాంతాల్లోనూ అధిక వర్షం కురిసింది. తెలంగాణలోకి శుక్రవారం నైరుతి రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బంగాళఖాతం, ఉత్తర బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాలు, త్రిపుర, మిజోరంలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటక, రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి విస్తరించనుంది. నైరుతి ప్రభావంతో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News