Sunday, April 28, 2024

లంకతో మూడు వన్డేలు!

- Advertisement -
- Advertisement -

Sri Lanka tour of India 2020

ముంబై : శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై భారత క్రికెట్ బోర్డు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా, శ్రీలంక సిరీస్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని బిసిసిఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో సిరీస్‌లో జరిగే మ్యాచ్‌ల గురించి జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మూడు వన్డేలు, మరో 3 టి20 మ్యాచ్‌లకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరించినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో భారత్‌తో సహా చాలా దేశాల్లో ఎక్కడి క్రికెట్ అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మాములుగా మారుతుండడంతో ఆయా దేశాలు క్రికెట్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నాయి. ఇక, ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు బిసిసిఐ సమ్మతించింది. సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఇక, దక్షిణాఫ్రికా సిరీస్‌ను మధ్యలోనే నిలిపి వేసిన భారత్ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే సిరీస్‌తో టీమిండియా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టనుంది. ఇదిలావుండగా ఈ సిరీస్‌లో 40 శాతం మంది అభిమానులకే అనుమతి ఇవ్వాలని శ్రీలంక బోర్డు భావిస్తోంది. భారత్‌తో పోల్చితే లంకలో కరోనా ప్రభావం పెద్దగా లేదు. అయినా లంకలో కూడా కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేశారు. ప్రస్తుతం లంకలో ఏ ఆంక్షలు అమల్లో లేవు.

దీంతో ఇప్పటికే డొమెస్టిక్ క్రికెట్ ప్రారంభమైంది. త్వరలోనే భారత క్రికెట్ జట్టు కూడా ఇక్కడికి రానుంది. మరోవైపు ఆసియాలోని ఇతర దేశాలతో పోల్చితే లంకలోనే పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ తాను ఆతిథ్యం ఇస్తున్న ఆసియాకప్‌ను కూడా ఇక్కడే నిర్వహించేందుకు అంగీకరించింది. కానీ, దీనిపై ఇంకా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News